Nursing Officers | రాష్ట్రంలో 2,050 నర్సింగ్ ఆఫీసర్ల భర్తీ..
Nursing Officers | రాష్ట్రంలో 2,050 నర్సింగ్ ఆఫీసర్ల భర్తీ..
Nursing Officer |రాష్ట్రంలో 2,050 నర్సింగ్ ఆఫీసర్ పోస్టులు భర్తీకి నోటిఫికేషన్
- ఈ నెల 28 నుంచి అక్టోబర్ 14 వరకు ఆన్‌లైన్ దరఖాస్తులు స్వీకరణకు గడువు
- దరఖాస్తుల సవరణకు అక్టోబర్ 16 నుంచి 17 వరకు అవకాశం
- నవంబర్ 17న కంప్యూటర్ బేస్డ్ పద్ధతిలో 13 కేంద్రాల్లో పరీక్ష
HYDERABAD | రాష్ట్రంలోని వివిధ శాఖల్లో 2,050 నర్సింగ్ ఆఫీసర్ (స్టాఫ్ నర్స్) పోస్టుల భర్తీకి వైద్య, ఆరోగ్య సేవల నియామక బోర్డు బుధవారం నోటిఫికేషన్ జారీచేసింది. అర్హులైన అభ్యర్థులు ఈ పోస్టులకు బోర్డు వెబ్‌సైట్ (https://mhsrb.telangana.gov.in) ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి గడువు విధించారు. ఈ నెల 28 నుంచి వచ్చే నెల 14వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తులు స్వీకరణకు గడువు ఉంది. అభ్యర్థులు తమ దరఖాస్తులను అక్టోబర్ 16వ తేదీ ఉదయం 10.30 గంటల నుంచి 17వ తేదీ సాయంత్రం 5.00 గంటల వరకు సవరించుకోవడానికి అవకాశం ఇచ్చారు. అయితే నవంబర్ 17న కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (సీబీటీ) విధానంలో, మొత్తం 13 కేంద్రాల్లో పరీక్ష నిర్వహించనున్నట్లు విడుదల చేసిన ఉద్యోగ నోటిఫికేషన్‌లో తెలిపారు.
* * *
Leave A Comment